ఖమ్మంలో 10వేల మందికి లైసెన్స్ లు ఇవ్వడం మా కర్తవ్యం.. మంత్రి పువ్వాడ
- సెప్టెంబర్ 23 వరకు ప్రతి రోజూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది
- కేవలం 15రోజుల్లోనే మొత్తం 2వేల మందికి లైసెన్స్
- LLR లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు
ఖమ్మం, జులై 22 (జనవిజయం):
ఖమ్మం నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని, 10వేల మంది లైసెన్స్ లేకుండా ఉన్నారన్న అంచనా మేరకు వారందరికీ లైసెన్స్ ఇవ్వడానికి పువ్వాడ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత లైసెన్సు లో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.
ఆన్లైన్ చేసుకున్న వారికి నేడు లెర్నింగ్ లైసెన్స్(LLR) ధృవ పత్రలను శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పత్రలను పంపిణి చేశారు. గడచిన మూడు రోజులుగా ధరఖాస్తు చేసుకున్న వారికి నేడు 602 మంది LLR కు దరఖాస్తు చేసుకోగా, నేటి వరకు మొత్తం దాదాపు 2వేల మంది LLR లైసెన్స్ పొందడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం లో డైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్నారని ఒక సర్వే ప్రకారం తెలుసుకున్నానని వారందరికీ లైసెన్స్ ఇప్పించాలని దృఢంగా నిశ్చయించుకున్నామని వివరించారు. మా ఫౌండేషన్ ద్వారా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అయ్యే ఖర్చును భరిస్తున్నామని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనేదే నా సంకల్పం అన్నారు.
చాలా జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి ప్రారంభించారని, చాలా మంది లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందని వారందరికీ లైసెన్స్ ఇవ్వడం రవాణా శాఖ మంత్రిగా నా బాధ్యత అన్నారు. ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ అని అన్నారు.
ఇటీవలే కాలంలో ముఖ్యంగా యువత ఎక్కువ శాతం వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారు తప్పక లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. లైసెన్స్ పొందాలంటే చాలా సమయం వేచి ఉండాలనే కారణంతో చాలా మంది తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా అనేక మంది వివిధ ఘటనలలో అనుకొని ప్రమాదాల్లో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని పేర్కొన్నారు.
అలాంటి వారి కోసమే డ్రైవింగ్ లో పలు సూచనలు, సురక్షిత డ్రైవింగ్ కోసం లైసెన్స్ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వగలగటం చాలా సంతృప్తిగా ఉందని, ఈ అవకాశాన్ని లైసెన్స్ లేని వారు వినియోగించుకోవాలని కోరారు.
ఈ మేళా ప్రారంభించిన పదిహేను రోజుల్లోనే దాదాపు 2వేల మందికి లైసెన్స్ ఇవ్వాగలగడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, RTO కిషన్ రావు, జిల్లా RTA మెంబర్ వల్లభనేని రామారావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, MVI వరప్రసాద్, కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, RJC కృష్ణ, కన్నం ప్రసన్న కృష్ణ, పిన్ని కోటేశ్వరరావు, రావూరి సైదుబాబు, తన్నీరు శోబారాణి, సైదా రావు తదితరులు ఉన్నారు.