జనవిజయంతెలంగాణపదిరోజులలోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం - మంత్రి పువ్వాడ వెల్లడి

పదిరోజులలోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం – మంత్రి పువ్వాడ వెల్లడి

  • రైతులు ఆందోళన చెందవద్దు
  • ఇప్పటివరకు 2 లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  
  • మిగిలిన ధాన్యం కొనుగోలు 10రోజులలో పూర్తి
  • ఖమ్మంలో పార్ బాయిల్డు మిల్లుల స్థాపనకు సహకరిస్తాం
  • ట్రాన్స్పోర్టు సమస్య లేకండా చూడాలంటూ అధికారులకు ఆదేశం

ఖమ్మం, మే25 (జనవిజయం) : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను 10 రోజులలోపు పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్షీనారాయణ, శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపెందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్నణ్ తో కలిసి జిల్లాలో ధాన్యం కొనుగోలు పురోగతిపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో యాసంగి 2020-21కు గాను 3 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాలకు గాను ఇప్పటివరకు 2 లక్షల 66 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, మిగిలిన లక్షా 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు 10 రోజులలోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు సరిపోను లేకపోవడం వల్ల నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మిల్లులకు ధాన్యాన్ని పంపించేందుకు మిల్లుల కేటాయింపు జరిగిందని, వాటిలో నల్గొండ జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నులను కేటాయించగా ఇప్పటికి కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లిఫ్ట్ చేయడం పట్ల పౌర సరఫరాల శాఖ మంత్రి, కమీషనర్లతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫోన్ లో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. నల్గొండ జిల్లాకు కేటాయించబడిన ధాన్యాన్ని కూడా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు పంపించే విధంగా తీర్మాసం చేసి వెనువెంటనే ప్రభుత్వానికి పంపారు. ఈ సంవత్సరం యాసంగి సీజన్ లో పంటసాగు విస్తీర్ణం పెరిగిందని, కోవిడ్-19 వల్ల ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగిందని, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో కాంటా వేసి ఉన్న 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పాటు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.

తదనుగుణంగా అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టి ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 106 మిల్లులను కేటాయించిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ సీజన్ లో పంజాబ్ తర్వాత ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కరోనా సమయంలో రైతులకు ఎటువంటి నష్టం జరగరాదనే ఆలోచనతో గౌర ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 2,300 రైసు మిల్లులలో కేవలం 800 మాత్రమే పారా బాయిల్డ్ దైసు మిల్లులు ఉన్నాయని, అంతేకాకుండా మన జిల్లాలో పారాబాయిల్డ్ రైస్ మిల్లులు తక్కువగా ఉన్నాయని పారాబాయిల్డ్ రైస్ మిల్లుల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన యెడల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందకుండా అధికారులు రైతులకు తెలియజేయాలని రాబోయో 10 రోజులలో పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతుందని కోవిడ్ ఉధృతి వల్ల కొంతమేర ఆలస్యం జరిగినప్పటికీ సమస్యను అధిగమించామని గన్నీ బ్యాగుల సమస్యలేదని ట్రాన్స్పర్టు విషయంలో కాంట్రాక్టర్లు సహకరించాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని మంత్రి సూచించారు. జిల్లాలోని 2,3,4,5 వ సెక్టారులో ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు రైతుల నుండి బస్తాకు 5 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది సరియైన చర్య కాదని, రవాణా శాఖ అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ట్రాన్స్పోర్టుకు సంబంధించి అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా శాఖాధికారిని మంత్రి ఆదేశించారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామానాగేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా సమయంలో జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ జరిపి జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అదేస్పూర్తితో ఈ సీజన్లో కూడా సమస్యలను అధిగమించి రైతులకు నష్టం జరుగకుండా పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ జరగాలని ఆయన తెలిపారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే విషయంలో లోడింగ్, ఆన్లోడింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక అధికారుల బృంధాలను కేటాయించిన యెడల సమస్య పరిష్కారమవుతుందని, పౌర సరఫరా శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల ఆదేశాల ననుసరించి జిల్లాలో రాబోయో పది రోజులలో ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. నల్గొండ జిల్లా సమస్య తీరినందున కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తామని, ధాన్యం రవాణాకు ఎటువంటి సమస్యలేదని రవాణా కాంట్రాక్టర్లు ఎవరైనా రైతులకు ఇబ్బంది కలిగిస్తే బాధ్యులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో కాంటావేసి ఉన్న ధాన్యంతోపాటు మరో 80 నుండి 90 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని కలెక్టర్ అన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులకు సంబంధించి 2 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ అయ్యాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య, వైరా శాసనసభ్యులు రాములు నాయక్, పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి తమ నియోజకవర్గాలలో ధాన్యం సేకరణ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సతుపల్లి నియోజకవర్గంలో 9 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉందని, అకాల వర్షాలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని త్వరగా మిల్లులకు తరలించాలని ఆయన కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ జిల్లాలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని ప్రజలకు భరోసా కల్పించామని అదేవిధంగా ధాన్యం సేకరణను పూర్తి స్థాయిలో చేపట్టి రైతులకు రైతులకు భరోసా కల్పించాలని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు.

పోలీసు కమీషనర్ విష్ణు,యస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్.మధుసూధన్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, డి.సి.సి. బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ చైరపర్సన్ పి. నీరజ, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా సహకార శాఖాధికారి విజయలక్ష్మీ, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సోములు, రవాణా శాఖాధికారి కిషన్‌రావు, రైస్ మిల్లర్స్ అసోసియోషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, ట్రాన్స్పర్టు కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి