జనవిజయంఆంధ్రప్రదేశ్సుప్రీంలో రేవంత్ కు ఊరట

సుప్రీంలో రేవంత్ కు ఊరట

  • ఇడి కేసులో రేవంత్ కు సుప్రీంలో ఊరట
  • కేసు విచారణ పూర్తయ్యే వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేత
  • నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఎసిబికి ఆదేశాలు

న్యూఢిల్లీ, మే28 (జనవిజయం): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా విచారణ పూర్తయ్యే వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలంటూ గవాయ్, సూర్యకాంత ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రధానంగా ఈడీ అభియోగం మోపింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఎంపీ రేవంత్ పై ప్రధానంగా అభియోగం మోపిన ఈడీ అధికారులు.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిషప్ సెబాస్టియన్ హ్యారీ, రుద్ర శివకుమార్ ఉదయ్ సింహా, మత్తయ్య జేరునలేం, కృష్ణ కీర్తన్ పై అభియోగాలు మోపారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడం, లేదా ఓటింగ్ కు గైర్హాజరు కావాలని అందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీఫెన్ ను రూ.50 లక్షలు ఇవ్వజూపగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు పెట్టింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి