షెడ్యూలు ప్రాంతం లోని ఆదివాసుల భూములకు రక్షణ చట్టం రెగ్యులేషన్ 1 ఆఫ్ 70
ఖమ్మం , మార్చి17 (జనవిజయం)
ఐదవ షెడ్యూలు ప్రాంతలోని భద్రాచల గ్రామంలో రెగ్యులేషన్ 1 ఆఫ్ 70 యాక్టు అమలును మరిచి ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారు.
రెగ్యులేషన్ 1 ఆఫ్ 70 యాక్టు ప్రకారం గిరిజనేతరుల మధ్య భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోళ్లను నిషేధిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ, భద్రాచలం గ్రామంలో విచ్చలవిడిగా ప్రభుత్వ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లను జరుగుతున్నాయని సర్వే నంబర్లు 50 మరియు 52 ల రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది.
భద్రాచల గ్రామంలోని 1978 సంవత్సర రికార్డుల ప్రకారం సర్వే నంబరు 50(50/2, 50/3, 50/4గా) లో మొత్తం 7ఎకరాల 86 సెంట్లు భూమి ఉన్నది. ఆ సర్వే నంబరులో ఒక భాగం 50/4 రాచాల పుల్లయ్య పేరున 1ఎకరం 61 సెంట్లు భూమిని ఉన్నట్లు తెలుస్తున్నది. అది క్రమేణా 2022-23 సంవత్సరానికల్లా సర్వే నంబరు 50 లోనే (50/2P A,50/2P AA……50/4గా) అనేక భాగాలుగా పెరిగిపోయి, దానికి తోడుగా భూమి కూడా 20ఎకరాల 29 సెంట్లుగా పెరిగినది. 1978 లో రాచాల పుల్లయ్య కు ఉన్న 1ఎకరం 61 సెంట్లు భూమి కూడా 2022-23 కల్లా 16ఎకరాల 02 సెంట్లు భూమిగా పెరిగి రాచాల పుల్లయ్య వారసుల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తుంది.
ఇంకొక సర్వే నంబరు 52(52/2, 52/4, 52/5గా) లో మొత్తం 3ఎకరాల 64 సెంట్లు భూమి 1978లో ఉండగా, సర్వే నంబరు లోని మొత్తం భూమికి యజమాని మల్లాది సుబ్రహ్మణ్యం గా తెలుస్తున్నది. కానీ 2022-23 లోని రికార్డుల ప్లకారం సర్వే నంబరు 52 లో(52/2, 52/2P……52/5Pగా) అనేక భాగాలుగా పెరిగి, ఆ బాగాలతో భూమి కూడా 10ఎకరాల 22 సెంట్లుగా పెరిగినది.
అందులో 2 ఎకరాల 11 సెంట్ల భూమికి హక్కు దారు యమజాల మధుసూదన్ మరియు మిగిలిన భూమి మొత్తం ప్రభుత్వ భూమిగా తెలుస్తుంది.
1978 లో శ్రీ రాచాల పుల్లయ్య కి 1ఎకరం 61 సెంట్లుగా ఉన్న భూమి 2022-23 కల్లా 16ఎకరాల 02 సెంట్లుగా పెరిగి రాచాల పుల్లయ్య వారసుల పేరుల తో రిజిస్ట్రేషన్లు జరిగినవి, అలాగే 3ఎకరాల 64 సెంట్లు మల్లాది సుబ్రహ్మణ్యం , యమజాల మధుసూదన్ పేరుగా మార్చిన విధానంను జిల్లా కోర్టునకు గానీ, రాష్ట్ర హైకోర్టునకు గానీ భద్రాచలం మండల అధికారి తెలుపవలెనని గుర్తు చేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర గవర్నరు షెడ్యూలు ప్రాంత గిరిజనుల సంక్షేమం కోసం.. రెగ్యులేషన్ 1 ఆఫ్ 70 యాక్టు అమలు జరిపాలని ఆదివాసీలందరము కోరుకుంటున్నాము.
ఇట్లు
… కొర్స జేజేరాంబాబు..