జనవిజయంఆంధ్రప్రదేశ్విశ్వం నిండిన బాలూ గళం

విశ్వం నిండిన బాలూ గళం

దు దశాబ్దాలుగా తెలుగువాడి ఆస్తిగా ప్రకాశించిన స్వరమాంత్రికుడు గాన గంధర్వుడు బాలు అని ఆప్యాయతతో అందరం పిలుచుకునే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం మనల్ని భౌతికంగా వీడినప్పటికీ ఆయన స్వరం, ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.

1946 జూన్ 4న జన్మించిన బాలు శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే చిత్రం ద్వారా చలన చిత్రసీమకు పరిచయమయ్యారు. అసాధారణ జ్ఞాపకశక్తి, వినయ సంపన్నత, ఏకాగ్రత, కఠోర పరిశ్రమతో గాయకుడిగా 50 సంవత్సరాల పాటు సంగీతాభిమానులకు తన గాన అమృతాన్ని పంచారు. బాలు అంటే తెలుగు మాట,భాష, వ్యక్తిత్వం, వేషధారణ, తెలుగు పాట…

బాలు ఏ భాషలో పాట పాడితే ఆ భాషాభిమానులు తమవాడిగా కీర్తించి పూజించి హృదయాలలో నిలుపుకున్నారు అందుకే గత నలభై రోజులుగా దేశం మొత్తం ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించింది. ఆ ప్రార్థనలు నెరవేరనప్పటికీ ఆయన శాశ్వతంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అనడంలో సందేహం లేదు.

అలనాటి అగ్ర కథానాయికలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులకే కాక రాజబాబు పద్మనాభం వంటి హాస్య నటులు కూడా వారి పడినట్లు గానే తన స్వరాన్ని మంత్ర దండంలా మార్చుకున్న స్వరమాంత్రికుడు బాలు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వేలాది పాటలు పాడిన బాలు ఏనాడు తన ప్రతిభకు గర్వ పడింది లేదు.

ప్రతి సందర్భంలో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గాయకుడుగా అవకాశం ఇచ్చిన ఎస్.పి.కోదండపాణి, మొదటి పాటకు అవకాశమిచ్చిన పద్మనాభం ను స్మరించు కోవడం ఆయన వినయ సంపన్నతకు నిదర్శనం. తెలుగు భాష పట్ల ఆయనకు ఉన్న అనురక్తి చాలా ప్రభావవంతమైనది. అక్షరాన్ని ఉచ్చరించటం లో ఆయన శైలి మన తరానికి ఖచ్చితంగా పెద్ద బాలశిక్ష. ఏ వేదిక పైన ఐనా ప్రతి పాట వెనుక ఉన్న సందర్భాన్ని తెలియజేస్తూ అందరినీ తలచుకుని వారి ప్రతిభను కీర్తించటం ఆయన మార్ధవ స్వభావానికి నిదర్శనం.

తెలుగు పదానికి జన్మదినం అంటూ అన్నమయ్య గురించి పాడినా, పిబరే రామరసం అంటూ గాన సుధను పంచినా, శ్రీరాముని స్తుతించినా, పుణ్యభూమి నాదేశం అంటూ దేశభక్తిని ప్రబోధించిన, కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు అంటూ చిలిపి పాటలు పాడిన, చిన్నారి పొన్నారి కిట్టయ్య అంటూ బాల్యం గురించి పాడిన, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అంటూ జానపదం పాడిన అది బాలు గొంతుకే సాధ్యం.

దశాబ్దాలపాటు ప్రజావాహిని లో మమేకమై తాను పాటై ప్రవహించిన గాయకుడు మరొకరు ఈ సృష్టిలో లేరు..రారు.. దేశవిదేశాలలో ఉన్న తెలుగువాడి హృదయాంతరాలలో శాశ్వత నివాసం కలిగిన ఏకైక స్వరం బాలుదే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మల్లాది, దాశరథి, సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ, సినారె, జాలాది, సిరివెన్నెల, సుద్దాల, వెన్నెలకంటి, చంద్ర బోస్, అనంత శ్రీరామ్ వంటి ఎందరో కవుల అక్షరాలకు కీర్తిని ఆర్జించి పెట్టిన ఏకైక గాయక శిఖామణి శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.

నా తరాన్ని గానంతో, అక్షరంతో, మాటతో, వ్యక్తిత్వంతో, తన బహుముఖ ప్రజ్ఞ పాటవాలతో
ప్రభావితం చేసిన బాలు మా ప్రతి కదలికలో చిరంజీవి గా శాశ్వత స్థానాన్ని కలిగి ఉంటాడు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    కవి, రచయిత
    9550776152

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి