విద్యార్థి నాయకులు రాకేష్ దత్త ఇంటికి విచ్చేసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య
ఖమ్మం, మార్చి 11( జనవిజయం )
జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య శనివారం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో గల విద్యార్థి నాయకులు రాకేష్ దత్త ఇంటికి విచ్చేశారు. విద్యార్థి నాయకులు రాకేష్ దత్త ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య కు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం బీసీ హాస్టల్లో నెలకొన్న సమస్యల గురించి రాకేష్ దత్త ఎంపీ ఆర్ కృష్ణయ్య కు వివరించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ., ఖమ్మం బీసీ హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థి నాయకులు రాకేష్ దత్త తన కొడుకు లాంటివాడని రాకేష్ దత్తను ఖమ్మం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పిండిప్రోలు రామ్మూర్తి, చింతల శ్రీను, హెచ్ విలాస్, గోనే శ్రీ శ్రీ, యూత్ నాయకులు చింతల రోహిత్, రమేష్, ఎస్కే షాను, సౌమిత్, దేవ్ దత్తూ, వాసిరెడ్డి సాయి తేజ, మాదర్, ఉపేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నా రు.