Saturday, September 30, 2023
HomeUncategorizedలోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి - త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలి - జిల్లా...

లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి – త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు

శనివారం ఖమ్మం కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాంక్ లోక్ అదాలత్ ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు.

లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి!
– త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలి!
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు

ఖమ్మం,మార్చి18(జనవిజయం): లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఖమ్మం కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాంక్ లోక్ అదాలత్ ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీ మార్గమే రాజ మార్గమని కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి 3 మాసములకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులకు సంబంధించి కేసులు ఎక్కువగా పెండింగులో ఉన్నందున, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా బ్యాంక్ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు, ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులకు సంబంధించిన కేసులు పరిష్కరించనున్నట్లు ఆయన అన్నారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా మాట్లాడుతూ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక అనుమతితో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేక లోకదాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. రుణ గ్రహీతలకు వడ్డీ పూర్తిగా మాఫీ చేయటంతో పాటు అసలు రుణంలో కూడా తగ్గింపు ఇస్తున్న బ్యాంకు అధికారులను ఆయన అభినందించారు. శనివారం బ్యాంక్ లోక్ అదాలత్ లో రూ. 6 లక్షలకు సంబంధించి 130 ప్రి లిటిగేషన్లను పరిష్కరించారు.

అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి బాల కార్మికుల నిర్మూలన, వరకట్నం రూపుమాపు, భ్రూణ హత్యలు నేరం లపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కొరకు విస్తృత ప్రచారానికి రూపొందించిన వాల్ పోస్టర్లను ఆటో ల వెనుక భాగంలో అంటించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆటో డ్రైవర్లతో పిల్లలను బాగా చదివించాలని, పనులలో పెట్టకూడదని, వరకట్నం నేరమని, ఇతరుల సొమ్మును ఆశించవద్దని, భ్రూణ హత్యలు పాపమని, తీవ్రమైన నేరమని అన్నారు. వీటి నిర్మూలనకు ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్. డాని రూట్, ఎన్. అమరావతి, ఎన్. శాంతి సోని, పి. మౌనిక, ఆర్. శాంతిలత, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొల్లపూడి రామారావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం పార్థసారథి మురళి, బ్యాంకర్లు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments