భద్రాచలం, ఆగస్ట్ 14 (జనవిజయం): రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ కమిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి రాత పరీక్షలు నిర్వహించకుండా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల అనుభవం ప్రకారం రెగ్యులర్ చేయాలని కోరుతూ వారు సోమవారం భద్రాచలం స ఎమ్మెల్యే పొదేం వీరయ్య కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర రెండోవ ఏఎన్ఎం యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు వేల్పుల మల్లికార్జున్, బల్ల సాయికుమార్, నోముల రామిరెడ్డి, రెండవలు ఏఎన్ఎంలు సారిక.బాలనాగమ్మ. రాజమ్మ వీరభద్రమ్మ శ్యామల అనిత సుజాత తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు