- పోస్ట్ కార్డుల ఉద్యమ పిలుపు విజయవంతం
కారేపల్లి, జూలై 31(జనవిజయం):
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టి యు డబ్ల్యూ జే ( ఐ జే యు) జిల్లా నాయకులు తాతా శ్రీనివాసరావు అన్నారు. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చలామణి అయ్యే విధంగా చూడాలని టి యు డబ్ల్యూ జే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా, యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావుల ఆదేశానుసారం సోమవారం కారేపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూనియన్ తరపున జర్నలిస్టులు పోస్ట్ కార్డులు రాసి, బాక్సులో వేసి, పోస్ట్ కార్డు ఉద్యమ పిలుపును విజయవంతం చేశారు.ఈ సందర్భంగా తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, టి యు డబ్ల్యు జే (ఐజేయు) యూనియన్ సభ్యులు కొండపల్లి వెంకటేశ్వర్లు, ఏపూరి లక్ష్మీనారాయణ, కొత్తూరి శ్రీనివాస్, ముక్కా వెంకటేశ్వర్లు, గుడెల్లి శ్రీనివాస్, చిన్ని ప్రవీణ్, కేతిమల్ల సురేష్, భయ్యా నాగేశ్వర్, బానోత్ బాలు నాయక్, నాగరాజు, రమేష్ లు పాల్గొన్నారు.