ఖమ్మం, ఆగస్టు 18 (జనవిజయం): విఆర్ఏ లకు పే స్కెళ్ళు వర్తింపు ప్రక్రియల భాగంగా 60 మంది ని మిషన్ భగీరథ విభాగానికి కేటాయించగా, వారిని హెల్పర్లు గా నియమించడం జరిగిందని మిషన్ భగీరథ సిఇ వి. శ్రీనివాస్ అన్నారు. హెల్పర్లుగా చేరిన వారికి శుక్రవారం వైరా లోని ముఖ్రిహిల్స్ వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు, సర్వీస్ రూల్స్, బాధ్యతలు, మిషన్ భగీరథ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించినట్లు సిఇ అన్నారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఇ ఈ. సదాశివ కుమార్, ఈఈ ఇంట్రా పుష్ప లత, ఈఈ గ్రిడ్ వాణి శ్రీ, డిఈఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.