మహబూబాబాద్ MP కవితక్క యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనాధ వృద్దులకు వస్త్ర దానం
జనవిజయం, 18 జూన్(మహబూబాబాద్):కన్న పిల్లలే తల్లిదండ్రులను అనాధ ఆశ్రయాలకు తరలించే ఈ సమాజంలో మేమున్నాం అంటూ బి.ఆర్.ఎస్ నాయకురాలు కటికనేని హరితక్క, ప్రవీణ్ కుమార్ తమ పెళ్లిరోజు సందర్బంగా
పట్టణంలోని 400 మంది అనాధాలకు అన్న దానం , 15 మంది అనాధ వృద్ధులకు వస్త్ర దానం మరియు అనాధ పిల్లలకు కలసిన వస్తువులను దానం చేశారు.
ఈ సందర్భంగా హరితక్క మాట్లాడుతూ.., మా పెండ్లి రోజు.. ఫాదర్స్ డే రోజు రావడం అదృష్టంగా భావిస్తున్నామని, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలకు రావడం అదృష్టంగా భావించాలని, అంతేకాదు అనాధాలను ప్రతి ఒక్కరు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ఎం.పి కవితక్క యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.