Thursday, March 28, 2024
HomeUncategorizedప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పెండింగ్‌ డబ్బులు రైతుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలి

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పెండింగ్‌ డబ్బులు రైతుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలి

  • తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు రైతుల విజ్ఞప్తి

ఖమ్మం,ఫిబ్రవరి 6(జనవిజయం): వానాకాలం సీజన్లో రైతులు పండిరచిన వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఎకౌంటుకు డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయలేదని,పెండిరగ్‌ ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ గారికి రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సుమారు 12 వేల మంది రైతుల డబ్బులు 150 కోట్ల రూపాయలు జమ చేయలేదని, దీని వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,48 గుంటల్లో డబ్బు చెల్లింస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు ప్రైవైట్‌ వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ధాన్యం రైతులు ఒత్తిడికి గురవుతున్నారని,మరోవైపు యాసంగి సీజన్‌ అవసరాలు ఉన్నాయని, రైతు కుటుంబంలో పిల్లల స్కూల్‌ ఫీజులు జనవరిలో చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో వరి పంట తప్ప ఇతర పంటలు సాగు కూడా లేని గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పెండిరగ్‌ ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఎకౌంటుకు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు,సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్‌,మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు,కొణిజర్ల మండల కార్యదర్శి చెరకుమల్లి కుటుంబరావు,బాజ్జొజ్‌ రమణ,యనమద్ది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments