Saturday, February 24, 2024
Homeరాజకీయందేశ రాజకీయాలకు అద్దం పట్టిన బీహార్‌ పరిణామాలు

దేశ రాజకీయాలకు అద్దం పట్టిన బీహార్‌ పరిణామాలు

  • సొంత ఎజెండాతోనే నితీశ్‌ రాకీయ ప్రయాణం
  • బలమైన ప్రతిపక్షంగా ఏర్పడడంలో విపక్షాల నిర్లక్ష్యం
  • నేలవిడిచి సాము చేస్తున్న పార్టీల నేతలు

న్యూఢిల్లీ,జనవరి31(ఆర్‌ఎన్‌ఎ): బిహార్‌లో జరుగుతున్నపరిణామాలను గమనిస్తే.. దేశ రాజకీయాలకు అద్దం పడుతోంది. దేశంలో మెజారిటీ పార్టీలకు నైతికత, సైద్దాంతికత నిబద్దత కానీ లేకుండా పోయాయి. జనతాదళ్‌ (ఎస్‌) నేత దేవెగౌడ కూడా నితీశ్‌కు తక్కువేం కాదు. పలుమార్లు ఆ పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి చేతులు కలపని పార్టీ అంటూ లేదు. డీఎంకే, అన్నాడీఎంకే కూడా పొత్తులు మారుస్తూ వచ్చాయి. కనుక బిహార్‌లో జరుగుతున్నది ప్రత్యేకమైన విషయంగా చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏది అవసరమో అది ఆచరించడం ఆయా పార్టీల నేతలు అలవర్చుకున్నారు. ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ కూడా అదే ఆచరించారు. దేశంలో రాజకీయాల ప్రమాణాలు రోజురోజుకూ క్షీణిస్తున్న సమయంలో విలువల గురించి ఆలోచించడం వృధా. అంతమాత్రాన ప్రతిపక్షాలు డీలాపడాల్సిన అవసరం లేదు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని మరిచిపోవాల్సిందే అని మల్లికార్జున ఖర్గే చెప్పడం కేవలం ఆయనలోని భయాన్ని సూచిస్తోంది. విపక్షాల్లో ఎంతగా భయం ఉంటుందో సహజంగానే మోడీలోనూ అలాంటి భయాలు ఉండివుంటాయి. మళ్లీ గెలవకపోతే అన్న భయం ఆయనలోనూ వెన్నాడుతుంది. ఎందుకంటే మన ప్రజలు ఎవరినూనా గద్దె దించగలరని నిరూపించారు. అందుకే ఇండియా కూటమి జనతా ప్రయోగం మాదిరి విజయం సాధిస్తుందన్న భయం మోడీలో కూడా ఉండివుంటుంది. అందుకే ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు ఆయన ప్రతి అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. నితీశ్‌ను చేరదీసి ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు.
ఇండియా కూటమి నుంచి నితీశ్‌ వైదొలగడం రాత్రికిరాత్రి జరిగిన పరిణామంగా చూడరాదు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన కుట్ర అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. దేశ రాజకీయాల్లో బీజేపీ ధాటిని చూసి భయపడిన నితీశ్‌ తన సీటును పదిలం చేసుకునే క్రమంలో తిరిగి ఎన్డీఎ గూటికి చేరడమే మంచిదని భావించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న నితీశ్‌ కుమార్‌కు రాజకీయాల్లో ఎలా మనుగడ సాగించాలో తెలుసు. ఎమ్మెల్సీగా ఉంటూనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌ కుమార్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ రికార్డుతోనే ఆయన తన రాజకీయ జీవిత చరమాంకం ముగియాలని కోరుకుంటున్నారు. బిహార్‌ రాజకీయాల్లో నితీశ్‌కు ఎంతో కొంత బలం లేకపోతే ప్రతి పార్టీ ఆయనతో చేతులు కలపాలని ఎందుకు అనుకుంటుంది అన్న విషయం కూడా ఆలోచించాలి. 2013, 2017, 2022లో మూడుసార్లు బీజేపీని వదుల్చుకున్నప్పుడు నితీశ్‌ను ఘోరంగా తిట్టిపోసిన ఆ పార్టీ నేతలు నాలుగోసారి 2024లో ఆయనను ఎందుకు అక్కున చేర్చుకున్నారు. బీజేపీ లెక్కల ప్రకారం కోయి, కుర్మీ, ధనుక్‌ వంటి యాదవేతర ఓట్లలో అత్యధికులు నితీశ్‌ వైపు ఉన్నారు. 14 శాతం యాదవులను మినహాయిస్తే, మిగిలిన 13 శాతం ఎన్డీఏ వైపు మళ్లించేందుకు బీజేపీ కృషి చేస్తోంది. నితీశ్‌ చొరవతోనే తొలుత ఇండియా కూటమికి కదలిక ఏర్పడిరది. ఒకవైపు ప్రతిపక్షాల అవకాశాలను దెబ్బతీస్తూనే బిహార్‌లో బలోపేతం అయ్యేందుకు నితీశ్‌తో బీజేపీ చేతులు కలిపింది. వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులను తన వైపు తిప్పుకునేందుకు మోదీ ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం ద్వారానే ఆయన విజయం సాధించగలిగారు. 2024 ఎన్నికల్లో మోదీ బీజేపీ 50 శాతం పైగా సాధించాలని పార్టీ నేతలను ఉత్సాహపరుస్తున్నప్పటికీ 63 శాతం బీజేపీ యేతర ఓట్లను చీల్చనిదే అది సాధ్యం కాదని ఆయనకు తెలియనిది కాదు. భారతదేశ రాజకీయాలను పూర్తిగా నియంత్రించేందుకు రానున్న రోజుల్లో మోదీ ఇంకా ఎన్ని ఆయుధాలనైనా ప్రయోగిస్తారు. అవి అప్రజాస్వామికం అన్నది బీజేపీ పట్టించుకోదు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ సర్వశక్తులు ఒడ్డుతారు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకలో సాధించిన ఫలితాలు కాంగ్రెస్‌ ఇతర రాష్టాల్ల్రో సాధించలేకపోతోంది. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చడం ఇప్పుడు కాంగ్రెస్‌ దోతపైనే ఆధారపడి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments