బోనకల్, ఆగస్టు 26(జనవిజయం): మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో తెల్లబోయిన రాములు జ్ఞాపకార్థం వారి కుమారులు తెల్లబోయిన కృష్ణయ్య, తెల్లబోయిన ముత్తయ్య, కుమార్తెలు కృష్ణకుమారి, ఎలమంచమ్మలు బొడ్రాయి సెంటర్ నందు గ్రామ ప్రజలకు ఉపయోగార్ధము రూ 50000 ఖర్చుతో బోరును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మా నాన్న పేరు నిలబడేలా ప్రజలకు ఉపయోగపడేలా తమ వంతు సహాయం చేశామన్నారు.ఈ బోరు ఏర్పాటుతో బొడ్రాయి, పీర్ల సావిడి, పశువుల హాస్పిటల్ కు వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో వారి మనవళ్లు తెల్లబోయిన నాగరాజు, గురవయ్య, సర్పంచ్ సుబ్బారావు, తాళ్లూరి రామారావు, బోగ్గవరపు సోమయ్య, మండెపూడి మోహన్ రావు, మెట్టెల లక్షాద్రి, తెల్లబోయిన నాసరయ్య, తెల్లబోయిన నాగయ్య, మేక వేలాద్రి, షేక్ మస్తాన్, బాలు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.