జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన పార్టీ ఇంఛార్జి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, మంత్రి పువ్వాడ
భద్రాద్రి కొత్తగూడెం , మార్చి 20(జనవిజయం:రవికుమార్)
బిఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు విజయవంతం చేయలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఆత్మీయసమ్మేళనాల బాధ్యతలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని, ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలన్నరు.పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయంగా వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నామని, రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేసేలా దిశానిర్దేశం చేయాలన్నారు.క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలను పంచుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ఎమ్మేల్యేలు వనమా వెంకటేశ్వర్లు, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధు , జెడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు , మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజెండర్ ఉన్నారు.