జన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకోలేదు
….పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్…
జనవిజయం, 2 జూలై(ఖమ్మం): ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభకు వెళ్తున్న వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ వాహనాలను నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ డైవర్షన్ మీనహా ఎక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. మీడియా సామజిక మాధ్యమాలలో అసత్య ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.