జనవిజయం కేలండర్, వెబ్సైట్ ఆవిష్కరణ

జనవిజయం వారపత్రిక 2020 కేలండర్ ఆవిష్కరణ, జనవిజయం వెబ్సైట్ ప్రారంభం కార్యక్రమం మంగళవారం ఖమ్మం నగరం మమత రోడ్ లోని మిల్క్ షేక్ ఫ్యాక్టరీలో ఘనంగా జరిగింది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం రాష్ట్ర మహిళా ఇన్ చార్జి , కీర్తిరత్న అవార్డ్ గ్రహీత డాక్టర్ లగడపాటి హేమలత కేలండర్ని ఆవిష్కరించారు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కవి, ఉపాధ్యాయులు కట్టా శ్రీనివాస్ జనవిజయం వెబ్సైట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనవిజయం ఎడిటర్ పల్లా కొండలరావు, వైబ్రంట్ ఆఫ్ కలాం స్టేట్ ఎన్విరాన్మెంట్ కో ఆర్డినేటర్ డి.సాయికిరణ్, వైబ్రంట్ ఆఫ్ కలాం మహిళా వింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ చార్జి రజని, ఖమ్మం జిల్లా ఇన్ చార్జి కోట అనితకుమారి, బి.బి.జి మార్కెటింగ్ డైరెక్టర్ షేక్ సైదాహుస్సేన్, జర్నలిస్టులు ఐతగాని జనార్ధన్, కోటపర్తి శ్రీనివాసరావు, బోయనపల్లి అంజయ్య, చెరుకుపల్లి పరశురాములు, బోయనపల్లి సురేష్, బొప్పాల అజయకుమార్, కోటి శ్రీధర్ లతో పాటు పర్సగాని గోపి, నంజాల గోపాలకృష్ణ, కె. గోపాలరావు, టి.గోపి, సుధీర్, సాయి, లాస్య తదితరులు పాల్గొన్నారు.

జనవిజయం కేలండర్ ఆవిష్కరించిన డా.లగడపాటి హేమలత

జనవిజయం వెబ్ సైట్ ని ప్రారంభించిన కట్టా శ్రీనివాస్.

 

కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం వీడియో

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://chat.whatsapp.com/GOqHPgWl3Kh2WxNCLkBgV4 గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *