Saturday, September 30, 2023
HomeUncategorizedగ్రీవెన్స్ డే లో అందిన సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి

గ్రీవెన్స్ డే లో అందిన సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి

-ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం,ఫిభ్రవరి6(జనవిజయం): గ్రీవెన్స్ డే లో అందిన సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిందలో నిర్వహించిన “గ్రీవెన్స్ చే”లో అర్జీదారులు నుండి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన షేక్ కాసీంసాహెబ్ తాను వ్యవసాయ కూలీనని తనకు ఆసరా పింఛను మంజూరుడై సమర్పించిన దరఖాస్తును జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పరిశీలించి తగు చర్యం ఆదేశించారు.కూసుమంచి మండలంకు చేగొమ్మ గ్రామంకు చెందిన పోటు పెంటయ్య తనకు చేగొమ్మ రెవెన్యూ పరిధిలో గల ఖాతానం. 67లో సర్వేనెం. 80 ఆ2/1/1లో తనకు 1,3100కు గాను ఆన్లైన్లో, 1700 కుంటలు మాత్రమే చూపిస్తున్నదని 0.14 కుంటల భూమి నమోదు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి. తగు చర్యకై దూసుమంచి తహశీల్దారును ఆదేశించారు. ఖమ్మం నగరం మామిళ్ళగూడెంకు చెందిన అనుగోజు హిమబిందు తాను వితంతురాలినని, తనకు ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై రఘునాథపాలెం మండల తహశీల్దారును ఆదేశించారు.కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంకు చెందిన తీర్థాల సూర్యనారాయణ ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో తన తండ్రిగారి ఆస్తి అయినటువంటి 30 ఎకరాల వ్యవసాయ భూమిలో ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి పాసుపుస్తకాలు. చేయించుకున్నారని వారి వద్ద నుండి తన వాటా తనకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి. తగు చరకై కామేపల్లి మండలం తహశీల్దారును ఆదేశించారు. కూసుమంచి మండలం సుంగల్ తండారు గ్రామ పంచాయితీకి చెందిన తేజావత్. రమేష్ తెల్లరేషన్ కార్డు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యకై జిల్లా పౌర సరఫరా శాఖ అధికారికి సూచించారు. రేగుల చెలక గ్రామ సర్పంచ్ కె. రామారావు రఘునాథపాలెం మండలం రేగుల చెలక గ్రామ పంచాయితీకి చెందిన సర్వేనెం. 228లో 0-27 కుంటలు మంచినీటి బావుల ఖాళీ స్థలం దురాక్రమణ కాకుండా చూడగలరని సమర్పించిన దరఖాస్తును విచారించి నివేదిక సమర్పించవలసినదిగా అదనపు కలెక్టరు సూచించారు. సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గిరిజన ప్రాంతమైన తొలగూడెంలో మత్సపారిశ్రామిక సంఘం ఏర్పాటు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు. తీసుకోవాల్సిందిగా జిల్లా మత్సశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా అధికారులు తదితరులు “గ్రీవెన్స్ డే” లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments