- తహశీల్దార్ కార్యాలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలి
- వైరాలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
వైరా, ఆగష్టు 8(జనవిజయం): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి దరఖాస్తులు సేకరణ గడువు ఆగస్టు చివరి వరకు పెంచాలి అని, తహశీల్దార్ కార్యాలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలి అని సిపిఎం ఆధ్వర్యంలో వైరా తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి దరఖాస్తులు లో అనేక నిబంధనలు విధించింది అని కనీసం వారం రోజులు కూడా దరఖాస్తులు సేకరణ గడువు ఇవ్వకుండా కేవలం మూడు రోజులు మాత్రమే గడువు విధించింది అని అన్నారు మరోవైపు బార్ షాపులు దరఖాస్తులు సేకరణ గడువు మాత్రం రెండు వారాలు సమయం ఇచ్చింది అని అన్నారు వైరా డిప్యూటీ తహశీల్దార్ రాము బుధవారం ,గురువారం ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం వైరా మండల కార్యదర్శి వర్గ సభ్యులు బాజోజ్ రమణ, నాగరాజు, కృష్ణ,మహిళలు పాల్గొన్నారు