కారేపల్లి, జూలై 31(జనవిజయం):
వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లి పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు గురై మృతి చెందిన రైతు సంఘటన సోమవారం సింగరేణి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని వెంకటియ్య తండా గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు ఆంగోత్ బన్సిలాల్, వయస్సు 50 సం, తన చేనులో వ్యవసాయ పనులు చేస్తూ హఠాత్తుగా మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు కలరు. ఇటీవల చీమలపాడు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పెద్ద కుమారుడు రవికుమార్ కు తీవ్ర గాయాల పాలై ఒక కాలు కోల్పోయాడు ఈ సంఘటనతోనే కుటుంబం మరవక ముందే అనుకోకుండా ఆ కుటుంబ యజమాని ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులను కలచివేసింది ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు