జనవిజయంతెలంగాణఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

  • వ్యవసాయ మార్కెట్ కార్మికులందరికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కల్పించాలి
  • కార్మికులందరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు మార్కెట్లోనే వేయాలి
  • సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్

ఖమ్మం, జూన్ 1(జనవిజయం): ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరియు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వ్యవసాయ మార్కెట్ లోనే కోవిడ్ హాస్పటల్ ఏర్పాటు చేయాలని అట్లాగే కార్మికులందరికీ వ్యాక్సిన్ వేసే ఏర్పాటు మార్కెట్లోనే చేయాలని అని డిమాండ్ చేస్తూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ ప్రథమ శ్రేణి కార్యదర్శి మరియు మార్కెట్ వైస్ చైర్మన్ అయినా కోటేశ్వర రావు గారికి సి ఐ టి యు ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వటం జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న కార్మికులు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది ఉన్నారు. అందరూ రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా మార్కెట్లో రైతు సరుకులను ఏ రోజుకారోజు పంపడం కోసం కృషి చేస్తున్నారు. ఇలాంటి వీరికి కరోనా వస్తే ఎలాంటి భద్రత లేదు కాబట్టి వీరందరికీ మార్కెట్లోనే వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అట్లాగే ప్రభుత్వ ఇన్సూరెన్స్ కల్పించాలని, వ్యాక్సిన్ కూడా మార్కెట్లోనే కార్మికులకు మిగతా వారందరకు కూడా ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. అందుకోసం ఈ రోజు మార్కెట్ పాలకవర్గానికి మరియు కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు కావాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రా శ్రీకాంత్, సిఐటియు నాయకులు బండారు యాకయ్య, మద్ది సత్యం, పాశం సత్యనారాయణ, మండల వీరస్వామి, వేల్పుల నాగేశ్వరరావు, మద్ది శీను, ఎర్ర శ్రీనివాస రావు, భూక్య శీను, రామకృష్ణ, మాధవరావు, ఎస్ వి ఆర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి