కాంగ్రెస్ పార్టీకి జై కొట్టనున్న వై ఎస్ షర్మిల..?!
పాలేరు బరిలో షర్మిల..!?
జనవిజయం, 18 జూన్: మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, వై ఎస్ ఆర్ టి పి అధినేత్రి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టబోతున్నట్లు తెలుస్తోంది.అంతే కాదు వై ఎస్ ఆర్ టి పి ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని కూడా సమాచారం. అంతేకాదు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి షర్మిల పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది . కె. వి.పి రామచంద్రా రావు మరియు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యూహం లో భాగంగానే వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషం పై కెవిపి రామచంద్రరావు మరియు డీకే శివకుమార్ భేటీ కానున్నట్లు సమాచారం.