ఎమ్మెల్యే సారూ! దళితవాడ రహదారి దుస్థితి జర దేఖో!!
వేంసూరు, జూలై 22 (జనవిజయం):
మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలోని భీమవరం పోవు రహాదారిలో గల డిసిసిబి బ్యాంక్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలువపై వున్న రహాదారి డిసిసిబి బ్యాంక్ నుండి అంబేద్కర్ కాలనీ దళిత వాడ మీదుగా లచ్చన్నగూడెం గ్రామం వరకు ఉన్నటువంటి రోడ్డు చిన్నపాటి వర్షానికి చిత్తడి చిత్తడిగా మారుతోంది. పాదచారులకు, వాహన దారులకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సారూ! మా దళితవాడ రహదారి జరదేకఖో!! అని వేడుకొంటున్నారు.
గతంలో మర్లపాడు గ్రామ సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డికి విషయం తెలపగ వారు రోడ్డుకి కందిమొరుం పోయించి తాత్కాలికంగా సమస్య తలెత్తకుండా చూసారు నాడు. కొంతకాలం పర్వాలేదు. ఇప్పుడు తిరిగి గత పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు వస్తున్నారు, పోతున్నారు. పట్టించుకున్న పాపాన పోలేదని, మా పిల్లలను బడికి పంపించాలన్న భయంగా ఉంటుందని, దళితులమనే చిన్నచూపు చూడకుండా అస్తవ్యస్తంగా ఉన్న మా రోడ్డుని పట్టించుకోగలరని దళితవాడ వాసులు అభ్యర్ధిస్తున్నారు.