- ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన తహసిల్దార్
. భద్రాచలం, మార్చి 14(జనవిజయం)..
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల దుమ్ముగూడెం లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రేపటినుండి అనగా 15వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీకు వరకు జరగనున్నాయి.
దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపల్ మరియు చీప్ సూపర్డెంట్ ఎల్. వెంకటేశ్వర్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కె గరుడాచలం తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఈ రోజు ఇన్విజిలేటర్లతో సమావేశం జరిగింది . వారికి పరీక్షల నిర్వహణ గురించి నియమ నిబంధనలు వివరించడం జరిగింది. అదేవిధంగా స్థానిక మండల రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని మరియు 144 సెక్షన్ నిబంధన అమలులో ఉంటుందని తెలియజేశారు.
పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు పాల్పడవద్దని ఎటువంటి మరియు గందరగోళం సృష్టించవద్దని తెలియజేయడం జరిగింది.పరీక్షలు రాయబోవు విద్యార్థులు అందరికీ సరిపడా మంచినీటి తాగు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం మరియు ఆరోగ్య శాఖ సిబ్బందినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ప్రతి రూములో ధారాళంగా వెలుతురు గాలి వచ్చే విధంగా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.మొదటి సంవత్సరం విద్యార్థులు 282 మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 217 మొత్తం 499 మందిహాజరవుతారని ఈ పరీక్ష నిర్వహణకు 15 మంది ఇన్విజిలేటర్లు గా వ్యవహరిస్తారని పరీక్షల నిర్వహణ అధికారి తెలియజేశారు.