మనీష్ సిసోడియా అరెస్టు కు ఆఫ్ ఖండన
బ్యాలెట్ పేపర్ నందు బీజేపీ కంటే ముందు ఉండడం సహించని మోడీ
..ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం పార్లమెంటు ఇన్చార్జి నల్లమోతు తిరుమలరావు..
ఖమ్మం, ఫిబ్రవరి 26(జనవిజయం):దేశంలోనే ఉత్తమమైన విద్యామంత్రి,డిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం పార్లమెంటు ఇన్చార్జి నల్లమోతు తిరుమలరావు నేడొక ప్రకటనలో ఖండించారు.ఆదానీ కేసు ప్రచారం నుండి మీడియా దృష్టి మరల్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియాను అరెస్టు చేశారు. ఆమ్ఆద్మీపార్టీ జాతీయ పార్టీగా అవతరించి బ్యాలెట్ పేపర్ నందు బీజేపీ కంటే ముందు ఉండడం సహించని మోడీ , బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఆఫ్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం సిబిఐ,ఈడీలను వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.రాజ్యాంగ సంస్థలను నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇంతగా వాడుకోవడం భవిష్యత్తు నియంత్రృత్వ పోకడలకు చిహ్నాలు గా ఆయన పేర్కొన్నారు.దేశప్రజలు బీజేపీ నిజరూపం అర్థం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.ఒక ఉత్తమమైన విద్యా మంత్రి, బలహీన వర్గాల ప్రతినిధి సిసోడియా అరెస్టును ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.